మేడ్చల్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ 16 నెలల పాలనలో కరువు ఏర్పడిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఎదరుచూస్తున్నారని చెప్పారు. అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, పోచారం అధ్యక్షుడు సురేందర్‌రెడ్డితో కలిసి మల్లారెడ్డి రజతోత్సవ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సభకు రావాలని వీధి వ్యాపారులకు ఆహ్వానపత్రికలను అందజేశారు. ఆటో లకు రజతోత్సవ పోస్టర్లను అతికించారు.