వనపర్తిలో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి
జిల్లాలో చెరువులను పటిష్టం చేయడం వల్ల రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వనపర్తిలో భూగర్భజలాల మట్టం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
వనపర్తి : జిల్లాలో చెరువులను పటిష్టం చేయడం వల్ల రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వనపర్తిలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మోడల్ మార్కెట్ , రాజపేట సమీపంలో నూతన పార్క్ పనులను కలెక్టర్ యాస్మిన్ భాషాతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా వనపర్తి అభివృద్ధి చేపడుతున్నామని వెల్లడించారు. నాలుగు దశాబ్దాల రోడ్ల విస్తరణను ప్రజల సహకారంతో పూర్తిచేస్తున్నామని అన్నారు. వనపర్తి మార్కెట్ ను రూ.49 కోట్లతో నూతనంగా నిర్మించామని, రూ.4 కోట్లతో ఎకో పార్క్ ను అభివృద్ధి చేశామని , మరో రూ.2 కోట్లతో వే సైడ్ మార్కెట్ నిర్మిస్తున్నామని వివరించారు. నగరం నాలుగు దిక్కులా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే ఈ అభివృద్ధి సాధ్యమయిందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

