నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండలంలోని ఔరవాణి గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వారు సమీక్ష నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై చర్చలు జరిపారు. గ్రామంలో పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు పక్క గ్రామానికి వెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వస్తుందని వాపోగా.. సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపేలా గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామానికి చెందిన ఓర్సు నాగలక్ష్మి అనారోగ్య బారినపడి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో మంజూరైన 16 వేల రూపాయలు చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.