జగిత్యాల: జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు, బైకు ఢీకొన్నాయి. దీంతో జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్వేత (SI Swetha) అక్కడికక్కడే మరణించారు. ఆమెతోపై బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారు. మంగళవారం ఉదయం ఎస్ఐ శ్వేత అర్నకొండ నుంచి జగిత్యాల వెళ్తున్నారు.
ఈ క్రమంలో చిల్వాకోడూర్ వద్ద ఎదురుగా వస్తున్న బైకును ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో ఎస్ఐ తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే చనిపోయారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా గుర్తించారు. కాగా, శ్వేత గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.