సూపర్ పోలీస్

రాయపర్తి, జనవరి 18: ఎముకలు కొరికే చలిలో, ఊరికి దూరాన బురద నీటి లో మూడు రోజులు గా అచేతనావస్థలో ఉన్న ఓ వృద్ధుడిని కాపాడారు వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్సై బండారి రాజు. వృద్ధుడిని తనే స్వయంగా భుజాలపై మోస్తూ దవాఖానకు తరలించారు. రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలోని ఊరకుంటలోని బురదలో పడి ఉన్న వృద్ధుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రాజు అక్కడికి వెళ్లి వృద్ధుడికి కొత్త దుస్తులు తొడిగారు. అతడిని తరలించేందుకు తెచ్చిన ట్రాక్టర్ బురదలో కూరుకుపోవడంతో ఎస్సై స్వయంగా భుజంపై మోసి బయటికి తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. వృద్ధుడి సంబంధీకుల సమాచారం దొరకలేదని, అతడిని తానే పోషిస్తానని ఎస్సై చెప్పారు. కాగా, వృద్ధుడిని కాపాడిన పోలీసులను ప్రజలు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

