గంగారం సెప్టెంబర్ 19: ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై దిలీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బావురుగొండకు చెందిన పడిగ శోభన్‌బాబు సత్తుపల్లి బెటాలియన్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజులుగా మెడ నొప్పితో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో హనుమకొండలోని ఓ దవాఖానలో పరీక్షలు చేయించుకొని 3 రోజులు సెలవు పెట్టి ఆదివారం బావురుగొండకు వచ్చాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు వాకింగ్ కోసమని చెప్పి బయటకు వెళ్లి రాలేదు. పొలం వద్ద శోభన్‌బాబు చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్టు స్థానికులు కుటుం బ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై దిలీప్ తెలిపారు.