ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఆర్పీఎఫ్ ఎస్ఐగా జెడ్ఎల్ ఠాక్రే (56) మూడేళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతోనే క్యాంప్‌లోని తన రూమ్‌లో ఠాక్రే ఫ్యాన్‌కి ఉరివేసుకొని మరణించారని తెలిపారు. కాగా, ఠాక్రే స్వస్థలం మహారాష్ట్ర. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏటూర్ నాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు.