SI Shankar | జగద్గిరిగుట్ట మే 24: సీజ్ చేసిన డీజే సౌండ్‌సిస్టం ఇవ్వటానికి లంచం డిమాండ్ చేసిన ఎస్ఐతోపాటు మరొకరిని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. పాపిరెడ్డినగర్‌కు చెందిన కిరణ్ డీజే నిర్వాహకుడు. మూడు నెలల క్రితం అధిక శబ్దంతో డీజే నిర్వహించాడని, పోలీసులు డీజే పరికరాలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి బయటపడాలని కిరణ్ పలుమార్లు పోలీసులను కలిశాడు.
ఆ కేసును పర్యవేక్షిస్తున్న ఎస్ఐ శంకర్ రూ.15 వేలు లంచాన్ని మధ్యవర్తి నాగేందర్‌కు ఇస్తే సామగ్రి అప్పగిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు కిరణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో కిరణ్ ఎస్ఐ సూచన మేరకు నాగేందర్‌కు డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి బృందం పట్టుకున్నారు. అతడిని విచారించగా ఎస్ఐ శంకర్ సూ చనతో డబ్బులు తీసుకున్నట్టు వెల్లడించాడు. ఎస్ఐ శంకర్‌తోపాటు మధ్యవర్తి నాగేందర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్లో తనిఖీ చేశారు. పట్టుబడ్డ వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.