Gadwal | కేటీదొడ్డి, అక్టోబర్ 22: జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన జములమ్మ ఖాళీ స్థలంలో బండలు పాతడంతో తన ఇంటికెళ్లే దారి మూసుకుపోయిందని బాధితుడు బ్యాగరి నాగప్ప తెలిపాడు. ఈ విషయంలో తమ మధ్య గొడవ తలెత్తగా.. దాడి చేశారంటూ కేటీదొడ్డి పీఎస్లో జములమ్మ ఫిర్యాదు మేరకు తనతోపాటు తమ్ముడు నర్సింహులును ఎస్సై శ్రీనివాసులు పీఎస్కు పిలిపించి దూషించడంతోపాటు కొట్టి సంతకం పెట్టించుకున్నారని వాపోయాడు. ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. నాగప్పపై కేసు నమోదు చేశామని, కొట్టలేదని ఎస్సై వివరణ ఇచ్చారు.