తిమ్మాజిపేట, సెప్టెంబర్ 10: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆయన సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో అశ్రునయాల మధ్య జరిగాయి. శ్వేతారెడ్డి సోమవారం రాత్రి చెన్నైలో మరణించగా.. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె భౌతికకాయాన్ని సొంతూరుకు తీసుకొచ్చారు. దీంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె పార్థివదేహాన్ని చూసి లక్ష్మారెడ్డి బోరున విలపించారు. గ్రామ శివారులోని వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అంత్యక్రియలకు పలువురు రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత మృతి చెందిన విషయం తెలుసుకొన్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఎర్ర శేఖర్, అంజయ్యయాదవ్, నరేందర్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు కర్నె ప్రభాకర్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మర్రి సతీమణి జమున, బీఆర్ఎస్ నాయకులు శ్వేత పార్థివదేహానికి నివాళులర్పించి లక్ష్మారెడ్డికి ధైర్యం చెప్పారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా లక్ష్మారెడ్డిని ఓదార్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
శ్వేతాలక్ష్మారెడ్డి మరణవార్త తీవ్రంగా బాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రా మం కొండారెడ్డిపల్లిని పూర్తిస్థాయి సోలార్ గ్రామంగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైంది. సీఎం ఆదేశాల మేరకు మాడల్ సోలార్ విలేజ్‌గా మార్చనున్నారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బీ సంతోష్, రెడ్కో వీసీ అండ్ ఎండీ అనిల, డైరెక్టర్ కే రాములు, ఇతర ముఖ్యశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో మంగళవా రం పర్యటించారు. గ్రామంలో మొత్తం 1,451 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.