హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : నేడు యూరియా, ఇతర ఎరువుల కోసం సొసైటీలు, దుకాణాల వద్ద లైన్లో పెట్టిన చెప్పులనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు చూపాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి రైతులకు సూచించారు.
యూరియా కోసం రైతాంగం అగచాట్లు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని సోమవారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ రైతులకు ఈ దుస్థితి ఎదురుకాలేదని సతీశ్‌రెడ్డి గుర్తుచేశారు.