దేవరుప్పుల, జూలై 31: వృద్ధ్దాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొడుకులు అన్నం పెట్టడం లేద ని ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. నడువలేని స్థితిలో ఆ తల్లి కుర్చీ ఆసరాగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొన్నది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడేనికి చెందిన కంచర్ల అయిలమ్మ (80)కు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. తనకున్న ఆరు ఎకరాల భూమిని కొడుకులకు పంచి ఇచ్చింది.
కొంతకాలం బాగానే చూసుకొన్న కొడుకులు ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో కూతురు కొన్నిరోజులు తల్లిని చూసుకొన్నది. కరోనాతో కూతురు చనిపోవడంతో ఆమె పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న అయిలమ్మ.. కుర్చీని ఆసరాగా చేసుకొని అరకిలోమీటర్ దూరం లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని.. తనకు న్యా యం చేయాలని వేడుకొన్నది. ముగ్గురు కొడుకులు అందుబాటులో లేకపోవడంతో వృద్ధురాలిని వాహనంలో ఇంటికి పంపించారు.