హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, డిసెంబర్ 5న ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ప్రచారం నిర్వహించారు.
సోమవారం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈ దురు వెంకన్న, వైఎస్ చైర్మన్ థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు కన్వీనర్ మౌలానా, కో-కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి రాణిగంజ్, కంటోన్మెంట్, పికెట్ డిపోలు, జేంజ్ ఓవర్ పాయింట్, సంగీత్ జోనల్ అకౌంట్ ఆఫీస్‌లో పర్యటించి ఉద్యమ కార్యాచరణను వివరించి, కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, 2021 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.