TS Assembly | నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. స్వల్పకాలిక చర్చ
TS Assembly | రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో నీటిపారుదలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అధికార పక్షం స్పీకర్ అనుమతి కోరింది. దాంతో స్పీకర్ అందుకు అనుమతించారు. అయితే పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం అధికారపక్షం టెక్నీషియన్‌ను తీసుకురావడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
TS Assembly: రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో నీటిపారుదలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అధికార పక్షం స్పీకర్ అనుమతి కోరింది. దాంతో స్పీకర్ అందుకు అనుమతించారు. అయితే పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం అధికారపక్షం టెక్నీషియన్‌ను తీసుకురావడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
సభలో సభ్యులు కాని వారిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం ఎలా అనుమతిస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. దాంతో కేసీఆర్ హయాంలోనూ పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు టెక్నీషియన్‌ను అనుమతించారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శ్రీధర్‌బాబు చెప్పింది అబద్ధమని హరీశ్‌రావు అన్నారు. అప్పట్లో కేసీఆరే స్వయంగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి స్వయంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. సభలోకి ఇతరులను అనుమతించడం సభా సాంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

