జడ్చర్ల, జూన్ 18 : జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చుతో బూట్లు అందజేస్తాన ని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. తాను నియోజకవర్గంలో గ తంలో పాదయాత్ర చేసిన సమయం లో పలువురు విద్యార్థులు చెప్పులు లేకుండా పాఠశాలలకు వెళ్తున్న విషయాన్ని గమనించినట్టు తెలిపారు. అ ప్పుడే పిల్లలకు షూస్ ఇప్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. నియోజకవర్గంలో 274 ప్రభుత్వ పాఠశాలల్లో 53 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారని వివరించారు. వీరందరికి రెండు నెలల్లో బూట్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.