హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాల విక్ర యం, సరఫరా కేసుల్లో వరుసగా తీ ర్పులు వస్తుండటంతో నిందితుల్లో భ యం పెరుగుతున్నదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. 2024లో ఎన్పీడీఎస్ చట్టం కింద మొత్తం 1,162 కేసులు నమోదు చేశామని, నిందితుల నుంచి 6,400 కిలోల గంజాయి, 683.81 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నామని, వీటిలో సంగారెడ్డిలో జిల్లాలో 21, మెదక్ జిల్లాలో 10, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 9, మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో 6 కలిపి మొత్తంగా 60 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని వివరించారు.
ఊర్కొండ ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్
కల్వకుర్తి/ఊర్కొండ, ఏప్రిల్ 18 : సంచలనం రేకెత్తించిన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ నిందితులను కోర్టు శుక్రవారం పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయ సమీపంలో మార్చి 28న వివాహితపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై ఏడుగురిపై గ్యాంగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరిని పోలీస్ కసడీకి ఐదు రోజుల పాటు కోర్టు అప్పగించగా.. మొదటి రోజు నిందితులను ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తే వాటి ఆధారంగా మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్టు చర్చ వినిపిస్తున్నది.