బాగాలేని చీర రిటర్న్ తీసుకోని షాపింగ్‌మాల్..షాకింగ్ తీర్పునిచ్చిన వినియోగదారుల ఫోరం!!
బాగాలేని చీరను రిటర్న్ తీసుకోని ఓ బట్టల షాప్‌నకు షాక్ తగిలింది. వినియోగదారుడికి చీరతోపాటు నష్టపరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకెళితే, కెళ్లితే, వరంగల్ పట్టణం విశ్వకర్మ వీధికి చెందిన శ్రీరామోజు శ్రీదేవి భర్త వెంకటేశ్వర్లు 24-12-2021న జీపీఎన్ రోడ్‌లోని కల్యాణలక్ష్మి షాపింగ్ మాల్, వరంగల్‌లో రూ.1400కు ఫ్యాన్సీ పట్టుచీర కొనుగోలు చేశాడు. చీర తయారీలో లోపాలను గమనించిన వినియోగదారుడు మరుసటిరోజు చీర మార్చి ఇవ్వాలని సదరు షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని కోరాడు. అయితే, ఇందుకు వారు నిరాకరించారు.
బాగాలేని చీరను రిటర్న్ తీసుకోని ఓ బట్టల షాప్‌నకు షాక్ తగిలింది. వినియోగదారుడికి చీరతోపాటు నష్టపరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకెళితే, వరంగల్ పట్టణం విశ్వకర్మ వీధికి చెందిన శ్రీరామోజు శ్రీదేవి భర్త వెంకటేశ్వర్లు 24-12-2021న జీపీఎన్ రోడ్‌లోని కల్యాణలక్ష్మి షాపింగ్ మాల్, వరంగల్‌లో రూ.1400కు ఫ్యాన్సీ పట్టుచీర కొనుగోలు చేశాడు. చీర తయారీలో లోపాలను గమనించిన వినియోగదారుడు మరుసటిరోజు చీర మార్చి ఇవ్వాలని సదరు షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని కోరాడు. అయితే, ఇందుకు వారు నిరాకరించారు.
దీంతో శ్రీరామోజు శ్రీదేవి వరంగల్‌లోని వినియోగదారుల కమిషన్‌లో వ్యక్తిగతంగా 15-02-2022 రోజున ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న వినియోగదారుల కమిషన్ కోర్టుకు హాజరు కావాలని ప్రతివాదులకు నోటీసులు పంపించింది. కల్యాణ లక్ష్మి షాపింగ్ యజమాన్యం.. కమిషన్ నోటీసులను తిరస్కరించడంతోపాటు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ గట్టుపల్లి నాగరాజు, మెంబర్లు వీ జనార్దన్‌రెడ్డి, సీహెచ్ సంధ్యారెడ్డితో కూడిన బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. చీర కొనుగోలు ధర రూపాయలు 1400లను 12 శాతం వడ్డీతో చెల్లించాలని లేదా చీరను మార్చి వినియోగదారుడికి అందజేయాలని, అలాగే, మానసిక ఇబ్బంది కలిగించినందుకు రూ. 5000, రవాణా ఖర్చులు రూ. వెయ్యిని 30 రోజుల వ్యవధిలో వినియోగదారుడికి చెల్లించాలని తీర్పు వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

