తిమ్మాజిపేట, మే 8 : బాలికను బెదిరించి ఆరు నెలలుగా ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో వెలుగుచూసింది. ఏఎస్సై ప్రిస్కిల్లా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తండ్రి చనిపోవడంతో తల్లి , తమ్ముడితో కలిసి ఉంటున్నది. ఆరు నెలల కిందట తల్లి సొంత పనులపై వేరే గ్రామానికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఈ విషయం గమనించి ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని సూచించాడు.
భయపడిన బాలిక ఈ విషయం తల్లికిగాని ఇతరులకు గాని చెప్పలేదు. ఇదే అదనుగా భావించిన సదరు యువకుడు బాలిక తల్లి పనుల కోసం బయటకు వెళ్లినప్పుడల్లా ఇంటికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవ బాలిక గర్భం దాల్చడంతో ఆగ్రహం చెందిన తల్లి ఆరా తీయడంతో విషయం బయటపడింది. శుక్రవారం బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేశామని ఏఎస్సై వెల్లడించారు.