గద్వాల్ : జిల్లాలో కాంగ్రెస్( Congress ) పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishnarao ) అనుచరుడు , గద్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ ( Kesav ) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ( Resign ) చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను కలిశారు. ఆయనతోపా టు మరో 10 మంది కౌన్సిలర్లు , ముఖ్య నాయకులు సెప్టెంబర్ 6న బీఆర్ఎస్ చేరనున్నట్లు ప్రకటించారు. గద్వాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు.