హోంశాఖ చీఫ్ సెక్రటరీగా శిఖాగోయెల్ బాధ్యతలు
రాష్ట్ర హోంశాఖ చీఫ్ సెక్రటరీగా డైరెక్టర్ జనరల్ శిఖాగోయెల్ శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ పదవుల్లో పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో శిఖా కొనసాగనున్నారు.
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర హోంశాఖ చీఫ్ సెక్రటరీగా డైరెక్టర్ జనరల్ శిఖాగోయెల్ శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ పదవుల్లో పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో శిఖా కొనసాగనున్నారు.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా డీఎస్ చౌహాన్ బీఆర్కేఆర్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఎక్స్ అఫీసియో ప్రిన్సిపల్ సెక్రటరీగా వి ధులు నిర్వర్తించనున్నారు. మల్టీజో న్-2 ఐజీగా షానవాజ్‌ఖాసీం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించా రు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా నియమితులైన అవినాశ్ మహంతి బాధ్యతలు చేపట్టారు.
హోంశాఖ, డీజీపీకి కోర్టు ధికరణ నోటీసులు
హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): ఈ-చలాన్లను బలవంతంగా వసూలు చేయరాదని, వాహనాలను స్వాధీనం చేసుకోరాదని ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ఉల్లంఘనపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్), చికడపల్లి ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 9న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఓ న్యాయవాది సూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడ్వకేట్ రాఘవేంద్ర దాఖ లు చేసిన కోర్టు ధికరణ పిటిషన్‌ను జస్టిస్ శ్రవణ్‌కుమార్ శుక్రవారం విచారించారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీని ఆదేశిస్తూ విచారణను జూన్ 19కి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

