సూర్యాపేట : సూర్యాపేట నూతన కలెక్టరేట్ భావన సముదాయంలో నిర్మాణం చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ ప్రక్రియలో ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ కీలకమన్నారు.
వాటిని సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచడానికి ప్రత్యేకమైన గోడౌన్స్ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో 22 కొత్త ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్స్ మంజూరయ్యాయని, అందులో 20 పూర్తి కాగా రెండు తుది దశలో ఉన్నాయని శశాంక్ గోయల్ తెలిపారు.