25 మంది ఎస్ఎం బాధ్యులపై కేసులు
పోక్సో కేసులో బాధితురాలి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను వివిధ సోషల్ మీడియా (ఎస్ఎం) వేదికల ద్వారా బహిర్గతం చేసిన వారిపై కేసు లు నమోదు చేస్తున్నట్టు పేట్‌బషీరాబాద్ పోలీసులు వెల్లడించారు.
- బాధితురాలి వ్యక్తిగత సమారం బహిర్గతం చేశారని చర్యలు
- రంగంలోకి సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో బాధితురాలి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను వివిధ సోషల్ మీడియా (ఎస్ఎం) వేదికల ద్వారా బహిర్గతం చేసిన వారిపై కేసు లు నమోదు చేస్తున్నట్టు పేట్‌బషీరాబాద్ పోలీసులు వెల్లడించారు. పోక్సో చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ నం.684/2026లో బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రు ల వివరాలను సోషల్‌మీడియాలో ప్రసారం చేస్తున్నట్టు మేడ్చల్-మలాజిగిరి జిల్లా బా లల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఫిర్యాదు చేశా రు.
ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నం.706/2026, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 74, సెక్షన్ 72(1) ఆఫ్ బీఎన్ఎస్, పోక్సో చట్టంలోని సెక్షన్ 23 కింద ఆయా వేదికల బాధ్యులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వాటిని ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖా తాల ఐడీలు, సంబంధిత యూఆర్ఎల్లను గుర్తించి, ఆయా ఖాతాదారులకు నోటీసులు పంపించినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 25 మంది సోషల్ మీడియా నిర్వాహకులు, ఇన్‌స్టా, ఫేస్బుక్ తదితర ఖాతాదారులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే వారి పూర్తి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

