హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న శాంతికుమారిని నియమించారు.
ఈ మేరకు శుక్రవారం మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేసే వరకు చైర్‌పర్సన్‌గా సీఎస్ వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెరా చైర్పర్సన్ నియామక ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది.