హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్‌గా భూత్కూరి శంకర్ లూక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం ఇప్పటికే తారీఖ్ అన్సారీని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా వైస్ చైర్మన్‌ను నియమించింది. ఆయన మూడేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.