కేపీహెచ్‌బీ ( హైదరాబాద్) : నగరంలో నకిలీ సర్టిఫికెట్లు ( Fake certificate ) విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ పోలీసులు (Shamshabad police) పట్టుకున్నారు. అందిన సమాచారం మేరకు కేపీహెచ్‌బీలోని శ్రీ వ్యాస కన్సల్టెన్సీ పేరుతో నకిలీ బీకాం (B.Com), బీటెక్( B.Tech) సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఆకాసపు హరీష్ , మావూరి మహేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరికి విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి సహాయం చేసినట్లు పోలీసులు వివరించారు.
సర్టిఫికెట్ల కోసం డబ్బులు వసూలు చేసి, అసలు ధ్రువపత్రాల్లేకుండానే 46 మందికి నకిలీ సర్టిఫికెట్లు, 24 మంది వీటి ద్వారా విదేశాలకు ప్రయాణం చేశారని పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా విదేశీ వీసాలు పొందిన అభ్యర్థుల కోసం వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం నిందితులను కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.