Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం సీజ్
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద 823 గ్రాముల బంగారం (Gold) పట్టుబడింది. దాని విలువ రూ.47 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని పేస్టుగా మార్చి, ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశాడని, దానిని లోదుస్తుల్లో దాచి తరలించే యత్నం చేశాడని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు.

రెండు రోజుల క్రితం ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. సూడాన్ జాతీయులైన 23 మంది మహిళలు సూడాన్ నుంచి షార్జా మీదుగా గురువారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వచ్చారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. దీంతో 14 కేజీల 906 గ్రాముల బంగారం లభించింది. దీనివిలువ రూ.7.89 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో ఆభరణాలను ఉంచి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.
Air Intelligence Unit of Hyderabad Customs in coordination with Airport Customs, recovered 14.9063 Kgs of gold after 23 Sudan nationals who arrived from Sudan via Sharjah at Rajiv Gandhi International Airport were intercepted yesterday: Customs pic.twitter.com/0S3h1p2vkN
— ANI (@ANI) February 23, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Customs
- Dubai
- gold
- Gold paste
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

