హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని అట వీ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఆదేశించారు. వర్షాకాలాన్ని వినియోగించుకుంటూ వన మహోత్సవాలను సక్సెస్ చేయాలని సూచించారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె శనివారం తొలిసారిగా అరణ్య భవన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం శాఖ కార్యకలాపాలు, పురోగతిపై ఉన్నతాధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ ఎఫ్సీఏ ప రిధిలోని పెండింగ్ ప్రతిపాదనలను వే గంగా పరిషరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.