హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): మైనార్టీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహైల్ మండిపడ్డారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు 24 శాతం నిధులను కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీల సంక్షేమ బడ్జెట్ను రూ.4వేల కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత 2024-25 సంవత్సరానికి రూ.3,003 కోట్లు మాత్రమే కేటాయించిందని, అందులోనూ ఇప్పటివరకు రూ.750 కోట్ల(24 శాతం)లోపే ఖర్చు చేసిందని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇదే అత్యల్పమని పేర్కొన్నారు.