98.47 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం.. షా బ్యాటరీస్ డైరెక్టర్ టీఏ అమీర్హసన్ అరెస్ట్
తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ భారీ జీఎస్టీ మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నకిలీ సంస్థలను సృష్టించి కోట్లాది రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందిన ఆరోపణలపై షా బ్యాటరీస్ డైరెక్టర్ టీఏ అమీర్హసన్ను అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ భారీ జీఎస్టీ మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నకిలీ సంస్థలను సృష్టించి కోట్లాది రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందిన ఆరోపణలపై షా బ్యాటరీస్ డైరెక్టర్ టీఏ అమీర్హసన్ను అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీర్హసన్ తన సహచరుల ద్వారా మొత్తం 17 బోగస్ కంపెనీలను ఏర్పాటుచేసి, వాటి ద్వారా షా బ్యాటరీస్‌కు రూ.98.47 కోట్ల మేర అక్రమ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్టు తేలింది.
ఈ నకిలీ సంస్థలు ఐటీసీ బదిలీ చేసిన అనంతరం స్వచ్ఛందం గా తమ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకున్నట్టు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఈ 17 సంస్థలు ప్రతినెలా తమ జీఎస్టీ రిటర్న్స్‌ను ఒకే కంప్యూటర్ నుంచి దాఖలు చేసినట్టు బయటపడింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు సుమారు రూ.571 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించినప్పటికీ, స్వచ్ఛందంగా కేవలం రూ.45.42 లక్షల పన్ను మాత్రమే చెల్లించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Ameer Hasan
- gst
- itc
- Shah Batteries
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

