షాద్‌నగర్, జూలై 7: మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో సిద్దాపూర్ డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన నిరసనలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి.. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.