హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): అప్పుడే మైనారిటీలకు కాంగ్రెస్ దగా చేసింది. 2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవటానికి అప్పటి ఏఐసీసీలో ముఖ్య నేత గులాం నబీ ఆజాద్‌తో సత్ససంబంధాలున్న షబ్బీర్ కీలక పాత్ర పోషించారు.
తాను కామారెడ్డి నుంచే పోటీచేస్తానని, అక్కడే తనకు పట్టుందని, సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓడిపోయినా పర్వాలేదు, కానీ మరోచోటి నుంచి తాను పోటీచేయనని షబ్బీర్ అలీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అయినా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన ప్రాపకం కోసం సీఎం కేసీఆర్ మీద పోటీ చేయాలనే ఉబలాటంలో షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో దిగాలని పట్టుబట్టి తన పంతాన్ని నెగ్గించుకొన్నారు.