ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 24: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మస్కాపూర్లోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఆరో తరగతి విద్యార్థిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి, కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్కాపూర్ బీసీ హాస్టల్ ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. హాస్టల్లో వారం క్రితం అర్ధరాత్రి 6వ తరగతి విద్యార్థిపై 8, 9వ తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలుడు కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారి ఫిర్యాదు మేరకు పాఠశాలలో ఉపాధ్యాయులు విచారణ చేపట్టారు. లైంగిక దాడికి పాల్పడిన విద్యార్థులకు టీసీ ఇచ్చి పాఠశాల, హాస్టల్ నుంచి పంపించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్, హాస్టల్ వార్డెన్ తెలిపారు.