కోడేరు, ఫిబ్రవరి 14 : శారీరక, మానసిక ఎదుగుదల లేని ఓ మూగ బాలికపై కామాంధుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కోడేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ బాలిక (12) ఇంట్లో ఈ నెల 12న ఒంటరిగా ఉన్నది.
అదే గ్రామానికి చెందిన గేదెల కాపరి బాల్రాజ్ ఇంట్లోకి చొరబడి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన బాలిక తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని పట్టుకున్నాడు. మద్యం మత్తులో తాను తప్పు చేశానని ఒప్పుకోగా.. అదే రోజు కోడేరు పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాల్రాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.