హైదరాబాద్ : నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ధర్నా చేసి విజయం పొందిన జెన్జీలు సింధు రెడ్డి, అస్మా, ప్రత్యూష హైదరాబాద్లోని వెంగళ్రావు పార్క్లో మొక్కలు నాటి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఎల్నినో ప్రభావం తగ్గి వర్షాలు కురియాలన్నా స్వచ్ఛమైన గాలి లభించాలన్నా విరివిగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. యువకులు తలుచుకుంటే చెయ్యలేనిది ఏమీ లేదు అన్నారు.
జెన్జీలు అందరు ఒక్కో మొక్క నాటిన దేశంలో పచ్చదనం పెరుగుతుందన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, కయ్య వెంకటేష్, కిరణ్ రాథోడ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.