తొర్రూరు, మే 20 : బాలికపై లైంగిక దాడి చేసిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ గణేశ్ తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పున్నం నర్స య్య(65) అదే గ్రామానికి చెందిన వంద ఏండ్లు పైబడిన ఓ వృద్ధుడి ఇంటి వద్ద వంట చేసేవాడు. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇద్దరు బాలికలు వృద్ధుడి ఇంటి వద్ద ఉన్న మామిడి చెట్టు వద్దకు వచ్చి మామిడికాయలు తెంపుతుండగా ఓ బాలికను నర్సయ్య ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు బుధవారం నర్సయ్యపై పోక్సో కేసు నమోదైంది.