చండ్రుగొండ, ఏప్రిల్ 5: భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నది. మండలానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ అన్నపురెడ్డిపల్లి మండలం వద్ద వారం రోజుల క్రితం మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి ఎవరూ స్పందించకపోవడంతో మండలంలోని సుమారు 40కిపైగా గ్రామాలకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. ఫలితంగా ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. పలు పంచాయతీల సిబ్బంది ట్యాంకర్లతో ద్వారా కొంతమేరకు నీటిని సరఫరా చేస్తున్నా సరిపోక ఇబ్బందులు పడుతున్నారు.