నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం ఎల్లారెడ్డిగూడెం వద్ద రెడీమిక్స్ లారీని ఓ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రంగా గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో పలువరు ప్రయాణికులకు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. ఈ ఘటనతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రదానికి గురైన రెండు వాహనాలను పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. డబుల్ డెక్కర్ బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.