సిటీబ్యూరో, శంషాబాద్ రూరల్, నవంబర్ 8: ఏటీసీ సమస్యతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం రాత్రి11:55 నిమిషాలకు వియత్నాం వెళ్లాల్సిన వీఎన్-984 వి మానం శనివారం ఉదయం 9గంటల వరకు వెళ్లకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తప్పుడు సమాచారం ఇస్తూ.. చివరకు సాంకేతిక సమస్యతో రద్దు చేశామని చెప్పడం ఏంటని అధికారులను నిలదీశారు. టికెట్ బుకింగ్‌తోపాటు వీసా ఇతర వాటికి రూ.3.5 లక్షలు ఖర్చు చేస్తే, 6గంటల తర్వాత విమానాన్ని రద్దు చేశామని ఎలా చెప్తారని మండిపడ్డారు. రద్దు విషయాన్ని ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు.