రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. గడిచిన 7 ఏండ్లుగా రూ.6644.26 కోట్లు ఖర్చుచేసి మైనారిటీ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది. క్రిస్మస్, రంజాన్ పండుగలకు ప్రభుత్వమే దుస్తుల పంపిణీ చేస్తున్నది. అసెంబ్లీలో సంక్షేమరంగంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం మైనారిటీ వర్గాల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాల వివరాలను సభ్యులకు అందజేసింది.