పెగడపల్లి, జులై 20 : అందరిపిల్లలాగే బడికి వెళ్లాల్సిన ఏడేండ్ల అక్షిత బతుకుపో రాటం చేస్తున్నది. బ్లడ్ క్యాన్సర్‌తో రెండేళ్లుగా నరకం చూస్తున్నది.
జగిత్యాల జిల్లా పెగడ పల్లి మండలం నరసింహునిపేటకు చెందిన అన్నారపు మల్లయ్య-కరుణ దంపతులకు ఒక్కగానొక్క కూతురు అక్షిత(7). మల్లయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా, కరుణ కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడూ ఇంట్లో అల్లరి చేసే ఆ చిన్నారి ఐదేళ్ల వయసులో అనారోగ్యం పాలైంది. తల్లిదండ్రులు కరీంన గర్ లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు తెలుపడంతో తల్లడిల్లిపోయారు.
చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో ఆందోళన చెందారు. రూ.15లక్షల వరకు అప్పు చేసి, కరీంనగర్, హైదరాబాద్ లోని దవాఖా నల్లో రెండేండ్లుగా చికిత్స చేయించారు. ప్రస్తుతం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ దవాఖా నలో కీమోథెరపీ చేయిస్తున్నారు. తమ దగ్గర డబ్బులు లేవని, దాతలు సహకరించి తమ బిడ్డను బతికించాలని అక్షిత తల్లిందండ్రులు వేడుకుంటున్నారు. అక్షిత తల్లి బ్యాంక్ ఖాతా (అన్నారపు కరుణ, యూనియన్ బ్యాంక్, గోపాల్రావుపేట, ఖాతా నంబర్ 017810100021213, ఐఎస్సీ కోడ్ UBIN0801739కి గానీ, ఫోన్‌పే, గుగూల్ పేకు సెల్ నంబర్ 99089 6805 ద్వారా దాతలు నగదు పంపించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.