ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 02:32:47

కారిగుళ్ల వాగులో చిక్కుకున్న కుటుంబం.. మహిళ మృతి

కారిగుళ్ల వాగులో చిక్కుకున్న కుటుంబం.. మహిళ మృతి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: పొలానికి వెళ్లొస్తున్న క్రమంలో ఓ కుటుంబం వాగులో చిక్కుకున్నది. ఆరుగురు ప్రాణాలతో బయటపడగా, ఓ మహిళ మృతిచెందింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలోని షాపూర్‌లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దశరథ్‌ తన భార్య అనితాబాయి, ఐదుగురు పిల్లలు, అత్త, మామతోపాటు మరొకరితో కలిసి పొలానికి వెళ్లారు. పనులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తు న్న సమయంలో కారిగుళ్ల వాగును దాటుతున్న క్రమంలో కుమారుడు బాబు(6), కూతుర్లు సోనీ(15), మహేశ్వరి(13), వినోద(11), దేవి(9) వాగులో గల్లంతయ్యారు. నలుగురు పిల్లలను దశరథ్‌(38) అతని భార్య అనితాబాయి(30) కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే కూతురు వినోదను కాపాడే ప్రయత్నంలో తల్లి అనితాబాయి వాగులో కొట్టుకుపోయి కల్కొడ చెరువులో శవమై తేలింది. కొంత దూరం వరద నీటిలో కొట్టుకుపోయిన వినోద చెట్టును పట్టుకొని ఒడ్డుకు చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తాళ్ల సాయంతో దశరథ్‌తోపాటు నలుగురు కూతుర్లు, కుమారుడు, అత్త(కమిలీబాయి), మామ(కిషన్‌), కూలీ(రేణుకాబాయి)ని వాగు దాటించారు. logo