Road accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. చిలుకలూరిపేట(Chilukaluripeta) వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి తిరుపతి వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లా కొండ మంజులూరు నుంచి వేలూరు వెళుతుండా ఈ దుర్ఘటన జరిగింది.
గాయపడిన వారిని గుంటూరు జీజెహెచ్కు తరలింపు. మృతులు చిలుకలూరిపేట మండలం వేలూరుకు చెందిన బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, సువార్తమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.