హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది తెలంగాణ నుంచి ఏడుగురు ఐపీఎస్ అధికారులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. వారిలో ముగ్గురు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్‌లు, మరో నలుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు.
వారిలో ప్రస్తుత డీజీపీ డాక్టర్ జితేందర్, మాజీ డీజీపీ, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా, రాష్ట్ర విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వీరితోపాటు సీనియర్ ఐపీఎస్‌లు వీబీ కమలాసన్‌రెడ్డి, డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, వీ సత్యనారాయణ, పీ విశ్వప్రసాద్ ఉన్నారు. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలల మధ్య వీరి ఉద్యోగ విరమణ షెడ్యూల్ ఉన్నది.