హైదరాబాద్ : తెలంగాణలో పనిచేస్తున్న ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా ( DG status) కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఒక ప్రకటనను విడుదల చేశారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేశ్ భగవత్( Mahesh Bhagavat ) , స్వాతిలక్రా, వీవీ శ్రీనివాసరావు,1996 బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, అనిల్‌కుమార్, సజ్జనార్ ( Sajjanar ) కు డైరెక్టర్ జనరల్ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.