నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 25 : నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలను జప్తుచేయాలని సీనియర్ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. వివరాల్లోకి వెళితే.. 1999లో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో రైతులు భూములు కోల్పోయారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో జాప్యం కావడంతో భూనిర్వాసితులు కో ర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన కోర్టు రైతుల కు తగిన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆర్డీవో కార్యాలయం రూ.1.40 కోట్లు, కలెక్టర్ కార్యాలయం రూ.6.79 కోట్లు చెల్లించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలను జప్తు చేయాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మంగళవారం కార్యాలయాలకు నోటీసులు పంపించారు.