మయన్మార్ ప్రధాని మనవరాలికి రెయిన్బో వైద్యుల చికిత్స

- మరో 15 మంది నిరుపేద చిన్నారులకు కూడా
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మయన్మార్ ప్రధాని మనవరాలితోపాటు మరో 15 మంది నిరుపేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించినట్టు హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ‘ఆ దేశ ప్రధాని మనవరాలికి 9 నెలలు. ఆ చిన్నారి పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్నది. ట్రాన్స్క్యాథటర్ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తేనే బతుకుతుంది. గతంలో రెయిన్బో వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్రావు కోనేటి ఆ దేశానికి వెళ్లి గుండె సంబంధిత చికిత్సలపై శిక్షణ ఇచ్చి వచ్చారు. దీంతో మయన్మార్ ప్రభుత్వం దవాఖానను సంప్రదించింది. వారి ఆహ్వానం మేరకు డాక్టర్ నాగేశ్వర్రావు, డాక్టర్ శ్వేతబక్రు మయన్మార్ వెళ్లి ఆ దేశ ప్రధాని మనవరాలికి చికిత్స చేసి, మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులను మయన్మార్ నావికాదళ చీఫ్ కమాండర్ ఘనంగా సన్మానించారు’ అని వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

