30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
30 లక్షల విలువ చేసే 2వేల నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయించి వారిని మోసం చేసేందుకు పన్నిన భారీ కుట్ర ను మల్కాజిగిరి పోలీసులు భగ్నం చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): 30 లక్షల విలువ చేసే 2వేల నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయించి వారిని మోసం చేసేందుకు పన్నిన భారీ కుట్ర ను మల్కాజిగిరి పోలీసులు భగ్నం చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
నర్మదాసాగర్ కంపెనీని పోలి ఉండే నకిలీ పత్తి విత్తనాల పౌచ్‌లను ము ద్రించి, అసలైనవిగా నమ్మించి రైతులకు విక్రయించేందుకు కుట్ర జరుగుతున్నదని, గుజరాత్‌కు చెందిన నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ సోలంకే యశ్వంతరావు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పాత నేరస్తుడైన యెరువ బాలషోరెడ్డి అలియాస్ శివారెడ్డి సూత్రధారిగా ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. మల్కాజిగిరి ఎస్వోటీ-2 బృందం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించి, నిఘా పెట్టింది.
బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ వద్ద త నిఖీ చే స్తుండగా.. బాలషోరెడ్డి ముఠా కారులో తరలిస్తున్న 12,800 నకిలీ కాటన్ సీడ్స్ పౌచ్‌లు లభ్యమయ్యా యి. దీంతో బాలషోరెడ్డి, కపర్తి బెంజిమెన్, దొంగ శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు నకిలీ విత్తనాలు రైతులకు విక్రయించాలని ప్ల్లాన్ చేసినట్టు తెలిపారు.
దీంతో బాలషోరెడ్డి, కాపర్తి బెంజిమెన్, దొంగ శ్రీనును అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 30 లక్షల విలువ చేసే 2 వేల నకిలీ పత్తి విత్తనాలు, 12,800 నకిలీ పౌచ్‌లు, మారుతీ ఈకో కారు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఎస్వోటీ డీసీపీ మనోహర్, మ ల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

