హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : మణికొండలోని సర్వేనంబర్ 211, 202లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి 1998లో కేటాయించిన 200 ఎకరాల్లో నిరుపయోగంగా ఉందని 50 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు రంగారెడ్డి కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. భూమిని పూర్తిస్థాయిలో వర్సిటీకే పరిమితం చేస్తూ గెజిట్ విడుదల చేయాలని జాన్‌వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగా ణ) : కాంగ్రెస్ సర్కారు తరచూ రాష్ట్రంలోని యూనివర్సిటీల భూములను లాకునే ప్రయత్నం చేయడం సరికాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో హెచ్‌సీయూ భూముల వేలానికి కుట్ర చేసిన రేవంత్ సర్కార్, తాజాగా గచ్చిబౌలిలోని ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాలు లాక్కోవాలని చూడడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
యూనివర్సిటీకి 200 ఎకరాల భూమి ఉన్నదని, ఖాళీ స్థలాన్ని పరిశోధన కేంద్రాలు, హాస్టళ్లకు ఉపయోగించాలి తప్ప కార్పొరేట్‌కు అప్పగించాలని చూస్తే ప్రభుత్వంపై విద్యార్థులతో తిరుగుబాటు చేస్తామని వారు హెచ్చరించారు. యూనివర్సిటీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులను ప్రభుత్వం వెంటనే వెనకి తీసుకొని భూములను రక్షించాలని ఈ సందర్భంగా మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.