హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానం (EK526)లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వద్ద నుంచి కస్టమ్స్ అధికారులు రూ.478.520 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ప్యాంట్, లోదుస్తుల్లో దాచి బంగారాన్ని తరలించేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. పట్టుకున్న బంగారం విలువ రూ.24.82లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.