హైదరాబాద్, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ) : గ్రామీణాభివృద్ధి శాఖ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఎస్ఆర్డీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఎస్ఆర్డీఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌డీఎస్‌లో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 3700కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సుబార్డినేట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు ఉన్నారని తెలిపారు. ప్రతి ఉద్యోగి కుటుంబానికి భరోసా కల్పిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హకు ప్రధాని మోదీకి లేదని, పదేండ్ల పాలనలో రైతులకు పైసా రుణమాఫీ చేయని ప్రధాని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. మహారాష్ట్ర సభలో తెలంగాణ ప్రభుత్వంపై మోదీ వ్యాఖ్యలను మంత్రి శనివారం ఒక ప్రకటనలో ఖండించారు.